Compact vs Slim Phones: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అనూహ్యంగా విస్తరిస్తోంది. వినియోగదారుల అవసరాలను బట్టి వేర్వేరు డిజైన్ లలో, ఫీచర్లలో ఫోన్లు లభిస్తున్నాయి. జనరేషన్ మారుతున్నట్లే.. మొబైల్ ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు వస్తూనే వస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ (Compact) ఫోన్లు, స్లిమ్ (Slim) ఫోన్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏది బెస్ట్? అనే ప్రశ్నకు సమాధానం వివరంగా చూద్దాం..
మొదట కాంపాక్ట్ ఫోన్ల విషయానికి వస్తే.. చిన్న పరిమాణంతో ఉండే ఫోన్లు, ఒక చేతితో ఇట్టే నావిగేట్ చేయవచ్చు. టైపింగ్, కాల్ అటెండ్ చేయడం లాంటి పనులు సులభంగా చేయవచ్చు. అలాగే పాకెట్ ఫ్రెండ్లీ డిజైన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ మొబైల్స్ చేతిలో పట్టు బాగా ఉండడంతో జారిపోవడం తక్కువగా ఉంటుంది. అయితే ఇందులో చిన్న స్క్రీన్ ఉండడంతో వీడియోలు, గేమింగ్ అనుభవం సరైన స్థాయిలో ఉండదు. అలాగే బ్యాటరీ పరిమితి కూడా తక్కువ (3500–4000mAh) ఉంటుంది. ఇంకా కెమెరా సెటప్ కూడా బేసిక్ స్థాయిలోనే ఉంటుంది.
Read Also:Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిట్..!
మరోవైపు స్లిమ్ ఫోన్ల పరిస్థితి చూస్తే.. స్టైలిష్ డిజైన్, పెద్ద డిస్‌ప్లే, పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు, ఫాస్ట్ చార్జింగ్ వంటి సదుపాయాలు పొందవచ్చు. అయితే, బాడీ స్లిమ్ కావడంతో పట్టుదల కొంచెం తక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా ఇందులో పెద్ద బ్యాటరీ, హీట్ మేనేజ్‌మెంట్ విషయంలో డిజైన్ పరిమితులు ఉండొచ్చు. వీటితోపాటు మరిన్ని విషయాలను మనం గమనించినట్లయితే..
* డిస్‌ప్లే పరంగా.. కాంపాక్ట్ ఫోన్లలో సాధారణంగా 5.5 ఇంచులకు తక్కువ డిస్‌ప్లే ఉంటుంది. ఇవి చిన్న స్క్రీన్ కావడంతో బేసిక్ యూజ్‌కు అనువుగా ఉంటాయి. అయితే స్లిమ్ ఫోన్లలో 6.4 నుంచి 6.8 ఇంచుల వరకు పెద్ద డిస్‌ప్లే లభిస్తుంది. వీటిలో Full HD+, AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
* అలాగే రిజల్యూషన్ విషయానికి వస్తే, కాంపాక్ట్ ఫోన్లు HD లేదా ఫుల్ HD రిజల్యూషన్ కు మాత్రమే పరిమితంగా ఉంటుంది. కానీ, స్లిమ్ ఫోన్లు ఎక్కువగా AMOLED స్క్రీన్, హై రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. వీటితో వీడియోలు, గేమింగ్ అనుభవం అద్భుతంగా ఉంటుంది.
* అలాగే బ్యాటరీ పరంగా చాలా తేడా కనపుడుతుంది. కాంపాక్ట్ ఫోన్లలో 3500mAh నుంచి 4500mAh వరకు మాత్రమే కెపాసిటీ ఉంటుంది. ఫోన్ పరిమాణం చిన్నగా ఉండటంతో పెద్ద బ్యాటరీ ఫిట్ చేయలేరు. కానీ స్లిమ్ ఫోన్లు సన్నగా ఉన్నా 4500mAh నుంచి 5500mAh వరకు ఉన్న బ్యాటరీతో వస్తాయి. ఇవి ఫాస్ట్ చార్జింగ్ (60W నుంచి 100W వరకు) సపోర్ట్ చేస్తాయి.
* కెమెరా సెటప్ లో కూడా స్పష్టమైన తేడా ఉంటుంది. కాంపాక్ట్ ఫోన్లలో సాధారణంగా 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ వంటి బేసిక్ లెన్స్‌లు మాత్రమే ఉంటాయి. స్లిమ్ ఫోన్లలో మాత్రం 108MP వరకు కెమెరాలు, OIS (Optical Image Stabilization), టెలిఫోటో జూమ్, నైట్ మోడ్ వంటి ఫీచర్లు లభ్యమవుతాయి.
* ప్రాసెసర్ పరంగా చూస్తే.. కాంపాక్ట్ ఫోన్లు ఎక్కువగా Snapdragon 695 లేదా Dimensity 6100 వంటి మిడ్‌రేంజ్ చిప్‌సెట్లను వాడుతాయి. ఇవి సాధారణ వాడకానికి సరిపోతాయి. అయితే, స్లిమ్ ఫోన్లు అధిక పనితీరును అందించే స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2, Dimensity 8300 అల్ట్రా వంటి ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ లను కలిగి ఉంటాయి.
* ఇక బిల్డ్ క్వాలిటీ విషయంలో కాంపాక్ట్ ఫోన్లు ఎక్కువగా ప్లాస్టిక్ లేదా మిశ్రమ మెటీరియల్స్ తో తయారు అనుతాయి. అదే స్లిమ్ ఫోన్లు గ్లాస్ బాడీ, మెటల్ ఫ్రేమ్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
* ఆడియో జాక్ విషయంలో కూడా తేడా ఉంది. కాంపాక్ట్ ఫోన్లలో కొన్ని మోడళ్లలో 3.5mm ఆడియో జాక్ ఇంకా లభిస్తున్నప్పటికీ, స్లిమ్ ఫోన్లలో అది ఎక్కువగా కనిపించదు.
Read Also:Xi Jinping: నియంతకు వీడ్కోలు..!? చైనాలో జిన్‌పింగ్ శకం ముగిసినట్లేనా..?
వారి ఇన్ని విషయాలను గమనించిన తర్వాత కూడా ఏది ఎంపిక చేసుకోవాలి..? అని అనుకుంటే, మీరు కాల్స్, మెసేజింగ్, సాధారణ వాడకం కోసం ఒక చేతితో ఉపయోగించేలా చూస్తే.. కాంపాక్ట్ ఫోన్ ఎంచుకోవాలి. అదే మీరు పవర్ యూజర్ అనుకుంటే.. వీడియోలు చూడడం, గేమింగ్, ఫోటోగ్రఫీ కోసం అధిక స్పెసిఫికేషన్లు కోరుకుంటే.. స్లిమ్ ఫోన్ ఎంచుకోవాలి. మొత్తంగా స్లిమ్ ఫోన్లు డిజైన్ పరంగా మెరుగైనా, కాంపాక్ట్ ఫోన్లు వాడే సౌలభ్యం పరంగా ముందు ఉంటాయి. కాబట్టి, ఫోన్ బాడీ కాదు.. మీ అవసరం ముఖ్యమైంది.. అనే విషయాన్ని గుర్తుంచుకుని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.