సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్ర లో నటించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా నవంబర్ 24 న థియేటర్ల లో విడుదల అయి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.మంచి వసూళ్లతో డీసెంట్ హిట్ అందుకుంది.మలయాళం హిట్ మూవీ నాయట్టుకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కోట బొమ్మాళి పీఎస్’కు తేజ మర్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమం లో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్ గురించి అప్‍డేట్ ఇచ్చింది.కోట బొమ్మాళి పీఎస్ చిత్రాన్ని సంక్రాంతికి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. “రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన ముగ్గురు పోలీసుల కథ. ఈ సంక్రాంతికి.. ఆహాలో. మీ పండుగ మూవీ లిస్టుకు మరింత డోస్ యాడ్ చేస్తున్నాం” అని వెల్లడించింది.
అయితే, సంక్రాంతికి కోట బొమ్మాళి సినిమాను స్ట్రీమింగ్‍కు తెస్తామని చెప్పిన ఆహా తేదీని మాత్రం వెల్లడించలేదు. అయితే, జనవరి 14 న ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది.కోట బొమ్మాళి పీఎస్ చిత్రంలో శ్రీకాంత్ తో పాటు రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు చేశారు. తేజ మర్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి రజినీ రాజ్ సంగీతం అందించారు.ఈ సినిమాలో ‘లింగి లింగి లింగిడి’ అనే జానపదం పాట తో ఈ చిత్రానికి రిలీజ్‍కు ముందే మంచి పాపులారిటీ వచ్చింది.కోట బొమ్మాళి చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్ మరియు విద్య కొప్పినీడి ప్రొడ్యూజ్ చేశారు. పోలీసులను రాజకీయ నాయకులు ఏవిధంగా వాడుకుంటున్నారనే కథాంశం తో ఈ మూవీ తెరకెక్కింది. థియేటర్స్ లో ఎంతగానో అలరించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన ముగ్గురు పోలీసుల కథ ఈ #KotabommaliPS కథ… ఈ సంక్రాంతి కి, మీ ఆహలో!
Adding dose of thrill to your festival movie list 🥳@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @DirTejaMarni @GA2Official @varusarath5 @bhanu_pratapa @Rshivani_1… pic.twitter.com/Zq45kmmCph— ahavideoin (@ahavideoIN) December 31, 2023