Delhi College Students: ఢిల్లీ కాలేజీ విద్యార్థిపై దాడి.. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ..!
- ఢిల్లీ యూనివర్శిటీలోని శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కాలేజీలో.
- రెండు విద్యార్థి సంఘాలు ఘర్షణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi College Students: ఢిల్లీ యూనివర్శిటీలోని శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కాలేజీలో ప్రిన్సిపాల్ కార్యాలయం బయట ఆదివారం నాడు 2 విద్యార్థి సంఘాలు ఘర్షణ పడ్డారు. ఫలితంగా., ఓ విద్యార్థి తలపాగా కింద పడిపోయింది. కళాశాల మాతృ సంస్థ ఢిల్లీ సిక్కు గురు ద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) ఆదేశాల మేరకు సెప్టెంబర్ 27న ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో తాము పాల్గొనబోమని కళాశాల అధికారులు చెప్పడంతో నిరసనల నేపథ్యంలో విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఇక ప్రిన్సిపాల్ కార్యాలయం బయట విద్యార్థుల సమూహం నిలబడి ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత, ఎర్రటి తలపాగా ధరించిన విద్యార్థిని అకస్మాత్తుగా కొంతమంది విద్యార్థులు లాగి కొట్టారు.
Gold Rate Today: బంగారం ధరకు మళ్లీ రెక్కలు.. 76 వేలు దాటేసిన గోల్డ్ రేట్స్!
Also Read
- Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్లు
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్‌మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
దాడి సమయంలో విద్యార్థి తలపాగా పడిపోవడంతో కొందరు విద్యార్థులు జోక్యం చేసుకున్నారు. వారిలో ఒకరు తలపాగాను ఎత్తుకుని, దానిని ధరించిన అబ్బాయికి ఇచ్చారు. మిగిలిన విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయం బయట నిలబడి ఉన్నారు. వారిలో కొందరు కార్యాలయ తలుపు తెరిచిన అధికారులతో మాట్లాడాడారు. కొంతసేపటి తర్వాత కొందరు విద్యార్థులు కాలేజీ గేటు వైపు పరుగులు తీశారు. ఈ గొడవలో తలపాగా పడిపోయిన విద్యార్థి ఘటనపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ సెక్షన్లు 299 (మత భావాలను దౌర్జన్యం చేసే ఉద్దేశపూర్వక చర్య), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 351(2) (నేరపూరిత బెదిరింపు), 3(5) లపై కేసు నమోదు చేసారు. అంతకుముందు, కళాశాల ప్రిన్సిపాల్ గుర్మోహిందర్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిపాలనకు లేఖ రాస్తూ, కళాశాల తన స్వంత విద్యార్థి ఎన్నికలను నిర్వహిస్తుందని చెప్పారు. డీఎస్‌జీఎంసీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. DSGMC నాలుగు ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలను నియంత్రిస్తుంది. శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల, శ్రీ గురునానక్ దేవ్ ఖల్సా కళాశాల, శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇవన్నీ DUSUతో అనుబంధంగా ఉన్నాయి.
MLA Madhavaram: ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు..
అయితే, మాతా సుందరి కాలేజ్ ఫర్ ఉమెన్, DSGMC పరిధిలోని మరొక కళాశాల DUSUతో అనుబంధించబడలేదు. శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కళాశాల సొంత ఎన్నికలకు స్టాఫ్ అడ్వైజరీ కమిటీ నామినేట్ చేసే ఆఫీస్ బేరర్లు ఉంటారని తెలిపారు. ఈ నిర్ణయం నిరసనలకు దారితీసింది. RSS అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP), కాంగ్రెస్ సంబంధించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) రెండింటికి చెందిన విద్యార్థులు తమ అభ్యంతరాలను తెలియజేయడానికి కళాశాలలో సమావేశమయ్యారు. DUSU నుండి DSGMC కాలేజీలను విడదీయడాన్ని సవాలు చేస్తూ ABVP కూడా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తాజావార్తలు
-
Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్లు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్‌మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!