Rashmika Mandanna: కాక్‌టెయిల్ 2 నుంచి క్రేజీ న్యూస్.. కృతితో నేషనల్ క్రష్ లవ్!

Cocktail 2

Cocktail 2

Rashmika Mandanna: ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒక పేరు తెగ వైరల్ అవుతుంది.. ఆ పేరు మరేదో కాదు.. నేషనల్ క్రష్ రష్మికది. ఆమె పెళ్లి రూమర్స్ మధ్య ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. కాక్‌టెయిల్ 2 లో మల్టీటాలెంటెడ్‌ రష్మిక ఒక క్రేజీ పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియా కోడైకూస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక తన తర్వాతి ప్రాజెక్ట్‌‌లో భాగంగా ఒక క్రేజీ రోల్ ప్లే చేస్తుందని సమాచారం. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘కాక్‌టెయిల్‌ 2’. ఈ సినిమాలో కృతి సనన్‌, రష్మిక కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

READ ALSO: Imran Khan: ప్లే బాయ్‌.. హ్యాండ్‌సమ్‌.. క్రికెట్‌లో తోపు.. చివరకు జైలు గోడల మధ్య చిక్కుకుపోయాడు.. ఇమ్రాన్‌ఖాన్‌ గూస్‌బంప్స్ స్టోరీ!

ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో కృతి, రష్మిక లెస్బియన్స్‌గా కనిపించనున్నట్లు జోరుగా ప్రచారం అవుతుంది. ఈ సినిమా ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటుదని సమాచారం. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని హోమీ అదజానియా డైరెక్షన్ వహిస్తున్నారు. 2012లో దీపికా పదుకొణె, డయానా, సైఫ్‌ అలీఖాన్‌లు నటించిన ‘కాక్‌టెయిల్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తుంది. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

READ ALSO: Team Rankings: సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంలో జింబాబ్వే, భారత్ స్థానం ఎంతంటే?