4 years of YSRCP Government Rule: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో నాలుగేళ్లు పూర్తి అవుతుంది.. ఏకంగా151 అసెంబ్లీ స్థానాలను, 22 ఏంపీ సీట్లను సాధించిన విజయం కేతనం ఎగురవేసింది వైసీపీ.. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్నో సవాళ్లును ఎదుర్కొంటూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలను ఇచ్చారు జగన్.. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ఆ పార్టీ చేసిన క్యాంపెయిన్, ఒక్క అవకాశం ఇవ్వండి.. పాలన అంటే ఏమిటో చూపిస్తామంటూ చేసిన ప్రచారం.. ఆ పార్టీ ఎంతగానో కలిసి వచ్చింది.. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ హామీని అమలు చేస్తున్నామని.. నాలుగేళ్ల పాలనలో ఏకంగా 98.4 శాతం హామీలను నెరవేర్చామని చెబుతున్నారు అధికార పార్టీ నేతలు.. అందుకే ప్రతీ గడపకు వెళ్లి.. ధైర్యంగా మేం చేసిన పనులను, అందించిన పథకాలను వివరిస్తున్నామని.. ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభిస్తోందని పేర్కొంటున్నారు.
కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెబుతున్నారు అధికార పార్టీ నేతలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కీలక రాజకీయ పదవులు కట్టబెట్టింది కూడా తమ ప్రభుత్వమే అంటున్నారు.. రాష్ట్రానికి కీలకమైన పోలవరం ప్రాజెక్టును ప్రారంభించేది మేమే.. కడప స్టీల్ ప్లాంట్‌ను, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌నే కాదు.. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం కూడా పూర్తి చేసేది మేమే అంటున్నారు.. గ్రామ, వార్డు సచివాలయాలు… జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పరిపాలన వికేంద్రీకరమ జరుగుతోందని.. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు.. గతంలో జరిగిన అన్యాయం.. మళ్లీ జరగకూడదు.. పరిపాలన వికేంద్రీకరణ మా లక్ష్యం.. అందుకే మూడు రాజధానులే మా విధానం అని స్పష్టం చేస్తున్నారు.. అయితే, వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకొని నాలుగేళ్లు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో #YSRCPAgain2024 హ్యాష్‌టాగ్‌ను ట్రెండ్ చేస్తున్నాయి ఆ పార్టీ శ్రేణులు..
ఇక, నాలుగేళ్ల పాలనపై ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. ”దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం.. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం.” అని పేర్కొంటు.. #YSRCPAgain2024 హ్యాష్‌టాగ్‌ను జోడించి ట్వీట్‌చేశారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 23, 2023