Aaditya Thackeray: సీఎం షిండేను రాజీనామా చేయమని అడిగారు.. ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray: ఏక్‌నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే శుక్రవారం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను రాజీనామా చేయాలని కోరినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. “ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను రాజీనామా చేయమని కోరినట్లు నేను విన్నాను. ప్రభుత్వంలో కొన్ని మార్పులు ఉండవచ్చు” అని ఆదిత్య ఠాక్రే అన్నారు.
మహారాష్ట్రలో నీచ రాజకీయాలు జరుగుతున్నాయని ఆదిత్య ఠాక్రే అన్నారు. ‘అత్యాశతో ఏడాది క్రితం మంత్రి పదవులు వదులుకున్న ఆ ద్రోహుల పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి కుర్చీ ప్రమాదంలో పడింది. వరుసగా నాలుగు రోజులుగా శాఖల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ముఖ్యమంత్రిని కూడా తొలగించే విషయమై చర్చలు జరుగుతున్నాయని విన్నాను.’ అని ఆదిత్య ఠాకే చెప్పారు. మహావికాస్ అఘాడీ సమావేశంలో ప్రజలకు న్యాయం కోసం చట్టవిరుద్ధమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారన్నారు. ప్రభుత్వంలో కూర్చున్న వారు తమ స్వప్రయోజనాలలో మునిగిపోయారని.. వారు పార్టీని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే పని చేస్తున్నారని ఠాక్రే అన్నారు.
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
Also Read: Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో మరో అమానుష ఘటన.. కదిలే కారులో బలవంతంగా పాదాలు నాకించి..
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో రాజకీయ తిరుగుబాటు తర్వాత శుక్రవారం రాత్రి ముంబైలోని గార్వేర్ క్లబ్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రసంగించారు. ఎన్సీపీ నాయకులు చేరిన ప్రభుత్వంలో చేరిన తర్వాత అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను శాంతింపజేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. “మేము పార్టీలను విచ్ఛిన్నం చేయము, అయితే ప్రధాని మోడీ నాయకత్వంపై నమ్మకంతో ఎవరైనా మాతో చేరాలనుకుంటే, మేము వారిని స్వాగతించాలి” అని అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్, 9 మంది ఇతర పార్టీ నేతలతో కలిసి జూలై 2న మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. అదే రోజు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!