Congress: “సర్పంచ్” ఫలితాలపై పీసీసీ సమీక్ష.. 18 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్‌ను ఎందుకు బుజ్జగించలేదు.. సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని పీసీసీ తేల్చింది. దీంతో అగ్రనాయకులు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయ్యిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు రెండు, మూడు రోజులగా సమీక్ష జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
READ MORE: Sankranti Special Trains: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. 600 ప్రత్యేక రైళ్లు
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. డిసెంబర్ 18న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12,702 గ్రామ పంచాయతీల్లో మొత్తం 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా పోటీ చేశారన్నారు. 4221 సర్పంచ్ లను బీజేపీ బీఆర్ఎస్ కూటమి గెలుచుకుందన్నారు. 33 శాతం గెలుచుకున్నారని తెలిపారు. మా రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం రేవంత్ తెలిపారు. కంటోన్మెంట్.. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను ఆశీర్వదించారు. 94 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 87 నియోజక వర్గాల్లో మెజారిటీ సాధించిందని కొనియాడారు..
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!