Site icon NTV Telugu

CM Revanth: ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

Revanth

Revanth

రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిన్న రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. అటు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్ లో పాల్గొననున్నారు.

Read Also: Raghunandan Rao: పెద్ద పదవులు అనుభవించి.. పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతారా..?

కాగా.. ఈ సమావేశంలో లోక్ సభ అభ్యర్థుల ఎంపిక.. తదుపరి అంశాలపై చర్చించనుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి తొలి జాబితాలో కాంగ్రెస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. అయితే.. రేపటి సీఈసీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించనున్నారు. అలాగే.. ఎన్నికల ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

 

Read Also: Heroine Accident: విజయ్ ఆంటోనీ హీరోయిన్‌కి రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్‌కి కూడా డబ్బుల్లేక?

Exit mobile version