CM Revanth Reddy: మనవడి మొక్కు.. కుటుంబ సమేతంగా తిరుమలకు సీఎం రేవంత్‌ రెడ్డి

Revanht Reddy

Revanht Reddy

CM Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రచనా అతిధిగృహం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తన మనవడి పుట్టెంట్రుకులు స్వామి వారికి రేవంత్ కుటుంబ సభ్యులు సమర్పించనున్నారు. ఈ రాత్రికి తిరుమల్లోనే రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Read Also: Uttam Kumar Reddy: మహేశ్వర్ రెడ్డి.. కనీస అవగాహన లేకుండా మాట్లాడొద్దు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా బాలాజీని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం రేపు (బుధవారం) తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్.