CM Revanth Reddy : దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి..
- దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను అధ్యయనం చేయాలి
- దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి
- హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుంది.. దానికి అనుగుణంగా టూరిజాన్నీ అభివృద్ధి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : టూరిజం పాలసీ పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో తెలంగాణ కు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని, దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను అధ్యయనం చేయాలన్నారు. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుంది.. దానికి అనుగుణంగా టూరిజాన్నీ అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి అయ్యేలా చూడాలని, టైగర్ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులను పెరిగేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టైగర్ రిజర్వు ఫారెస్ట్ లను దేవాలయాలతో కనెక్ట్ చేయాలని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చే వాతావరణాన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పల్ల టెంపుల్ టూరిజం పెరిగిందన్నారు. రోటిన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజం పైన ద్రుష్టి సారించాలని, ఫ్యూచర్ సిటీ లో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు పైన అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.
Kunamneni Sambasiva Rao : మంత్రి హామీతో రేపటి నుండి జరపతలపెట్టిన ఆటో కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
అంతేకాకుండా..’ఎయిర్ ఫోర్ట్ నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్ కు చేరుకునేలా ఉండాలి… డెస్టినేషన్ వెడ్డింగ్ లకు అనువైన ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలి… పర్యాటక శాఖ స్థలాల లీజు లపైన ఆరా తీసిన ముఖ్యమంత్రి… టూరిజం స్థలాలు,లీజు లపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు… లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి… కోర్టు కేసులను సీరియస్ తీసుకోని స్టే లు ఎత్తివేసే లా చూడాలని స్పష్టం… అడ్వకేట్ జనరల్ తో చర్చించి మంచి న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవాలని సూచన… మంచి గుర్తింపు ఉన్న కంపెనీ లకు పర్యటక స్థలాలు లీజ్ కు ఇవ్వాలి… తెలంగాణ లో టూరిజం అభివృద్ధి కి మంచి అవకాశాలు ఉన్నాయి…. ఎయిర్ ఫోర్ట్ నుంచి మూడు గంటల్లో తెలంగాణ లో ఎక్కడికైనా చేరుకోవచ్చు… తెలంగాణ లో శాంతిభద్రతలు బాగున్నాయి, గ్రామీణ రోడ్లు బాగున్నాయి…అన్ని రకాల ఆహారం దొరుకుతుంది… ఉస్మానియా ఆసుపత్రి ని ఖాళీ చేయించి మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం… చార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలి… అసెంబ్లీ లో నూతన టూరిజం పాలసీ ని ప్రవేశ పెట్టి సమగ్రంగా చర్చ జరిగేలా చూద్దాం…. సొంత కాళ్ల పైన నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే.. . వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న టూరిజం పాలసీ లను ముఖ్యమంత్రి కి వివరించారు అధికారులు… ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, టూరిజం శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డి, సీఎంవో ఓస్డీ వేముల శ్రీనివాసులు,సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!