Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Three Layer Police System Telangana

CM Revanth Reddy : మండలానికి ఒక పోలీస్ స్టేషన్.. పని భారం తగ్గిస్తాం.. సీఎం రేవంత్ కీలక హామీలు.!

Published Date :March 9, 2026 , 9:41 pm
By Gogikar Sai Krishna
  • పోలీస్ అధికారుల రీట్రీట్‌లో సీఎం రేవంత్ దిశానిర్దేశం
  • సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
  • మండలానికి ఒక పోలీస్ స్టేషన్.. త్రీ లేయర్ పోలీస్ వ్యవస్థ
  • పోలీస్ సంక్షేమం, పారదర్శక పోస్టింగ్‌లపై సీఎం హామీ
CM Revanth Reddy : మండలానికి ఒక పోలీస్ స్టేషన్.. పని భారం తగ్గిస్తాం..  సీఎం రేవంత్ కీలక హామీలు.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో పోలీస్ శాఖ పోషించాల్సిన పాత్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సమాజం ఎదుర్కొంటున్న ఆధునిక సవాళ్లను పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా సమస్యను లోతుగా అధ్యయనం చేసి, అందులోని సాంకేతిక అంశాలను అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారం లభిస్తుందని, అలా అవగాహన పెంచుకున్నప్పుడే 50 శాతం సమస్య పరిష్కారం అయినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

High Protein Soya Chilla Recipe: మంచి ప్రోటీన్‌ బ్రేక్‌ఫాస్ట్.. సోయా చిల్లా రెసిపీ సింపుల్‌గా ఇలా.. 

ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్, సైబర్ క్రైమ్ , లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. శాంతిభద్రతలు బలంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేర స్వభావం పూర్తిగా మారిందని, భౌతిక నేరాల కంటే సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ సాక్ష్యాలు కీలకంగా మారిన ఈ రోజుల్లో, సాంకేతిక నైపుణ్యం కలిగిన అధికారుల అవసరం ఎంతైనా ఉందని, అధికారులు నిరంతరం అప్‌గ్రేడ్ అవ్వాలని సూచించారు.

 Gen Z Reality : 23 ఏళ్లకే పచ్చి తాగుబోతులుగా మారుతున్న యువత..!

దేశ రాజధాని ఢిల్లీ వంటి నగరాలు కాలుష్యంతో అల్లాడుతున్న తరుణంలో, మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి హైదరాబాద్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాలని పిలుపునిచ్చారు. కేవలం రెండు సెంటీమీటర్ల వర్షం పడితేనే నగరం స్తంభించిపోయే పరిస్థితి ఉండకూడదని, అత్యవసర సమయాల్లో ప్రజలకు ఆపద్బాంధవుల్లా కనిపించే పోలీసులు ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలని కోరారు. అలాగే, పోలీసులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించేందుకు జనాభా ప్రాతిపదికన కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉండేలా ‘త్రీ లేయర్’ పోలీస్ వ్యవస్థను తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

పోలీస్ సంక్షేమం , పోస్టింగ్‌ల విషయంలో తన ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అనుసరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో పోస్టింగ్‌ల కోసం పైరవీలు జరిగే పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు కేవలం మెరిట్ , కేటగిరీ ఆధారంగానే బాధ్యతలు అప్పగిస్తున్నామని గుర్తుచేశారు. పోలీస్ అధికారులు కేవలం పై స్థాయి ఆదేశాలను పాటించడమే కాకుండా, కింది స్థాయి సిబ్బందితో చర్చించి వారి సమస్యలను వినాలని, అలా చేసినప్పుడే వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయని సూచించారు. ప్రభుత్వ ఖజానా పరిస్థితి దృష్ట్యా నిధులను సక్రమంగా వినియోగించాలని కోరుతూ, పోలీస్ శాఖను ఆధునీకరించేందుకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పురోగతిలో పోలీస్ శాఖను భాగస్వాములను చేస్తూ, తదుపరి రీట్రీట్ కార్యక్రమాన్ని 2026 డిసెంబర్‌లో నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cyber crime
  • Hyderabad Law and Order
  • police reforms
  • revanth reddy
  • telangana development

తాజావార్తలు

  • Storyboard: బిహార్‌లో బీజేపీ మార్క్ పాలిటిక్స్? నితీష్‌ను రాజ్యసభకు పంపడం వెనుకున్న ప్లాన్ ఏంటి..?

  • Lakshmi Manchu: ‘పుష్ప సినిమాలో ఆ డైలాగ్‌ నాదే’: మంచు లక్ష్మి

  • CM Revanth Reddy : మండలానికి ఒక పోలీస్ స్టేషన్.. పని భారం తగ్గిస్తాం.. సీఎం రేవంత్ కీలక హామీలు.!

  • Stop Eating 3 Hours Before Sleep: పడుకునే 3 గంటల ముందే భోజనం ముగిస్తే ఏం జరుగుతుంది..? స్టడీలో వెలుగులోకి కీలక అంశాలు..

  • Telangana: తెలంగాణ మహిళా రైతులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions