టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది బాలయ్య సరసన ‘భగవంత్ కేసరి’ సినిమా లో నటించి మెప్పించింది.. అక్టోబర్ 19 న దసరా కానుక గా విడుదల అయిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది.సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2, ఉమా, సత్యభామ వంటి సినిమాల లో నటిస్తుంది. ఇదిలా ఉంటే కాజల్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోరూమ్ ల ప్రారంభోత్సవాల కు కూడా వెళ్తోంది. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కాజల్ సందడి చేసింది. కాజల్ రాక తో అభిమానులు తరలివచ్చారు.కూకట్ పల్లిలోని పీఎన్ఆర్ ఫస్ట్ ఫ్లోర్ లో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమాండ్స్ షోరూం ను కాజల్ ఈరోజు లాంఛనం గా ప్రారంభించారు.
ఈ సందర్భం గా ఫ్యాన్స్ వందలకొద్దీ అక్కడికి చేరుకున్నారు. ప్రారంభోత్సవానికి ముందు కాజల్ తన అభిమానులను పలకరించింది. తనకు అందించిన బొకేను ఫ్యాన్స్ కు బహుమతి గా ఇచ్చింది.షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరైన కాజల్ చీరకట్టు లో ఆకట్టుకుంది. ట్రాన్స్ ఫరెంట్ శారీ మరియు మ్యాచింగ్ బ్లౌజ్, ఆకట్టుకునే జ్యూయెల్లరీలో మెరిసిపోయింది. తన అందానికి మరింత మెరుపులు దిద్ది అభిమానులకు దర్శనమిచ్చింది. ఫ్యాన్స్ ప్రస్తుతం కాజల్ లేటెస్ట్ లుక్ కు సంబంధించి ఫొటోలు, వీడియోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.ఈ సందర్భం గా కాజల్ మాట్లాడుతూ… దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ షోరూం లో ఏర్పాటు చేసిన బ్రెయిడల్ కలెక్షన్స్ చాలా అద్భుతం గా ఉన్నాయి. హైదరాబాద్ లోని మహిళలు ఒక్కసారైనా కలెక్షన్స్ ను చూడాలని సూచించింది. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ తమ షోరూమ్ ప్రత్యేకత లను వివరించారు.విక్టోరియన్ కలెక్షన్స్, పోల్కి డైమండ్స్, నగిషీ మరియు కుందన బ్రైడల్ జ్యుయలరీ అందుబాటు లో ఉన్నాయన్నారు.