శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం కోసం తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం పాలన కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.. మేము ప్రజాస్వామిక పాలన అందిస్తామని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా.. అందరికీ నిరసనలు తెలుపుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు.