Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Slams Kcr Over Krishna Water Dispute Calls For Open Assembly Debate

CM Revanth Reddy: ఆంధ్రా పక్షాన పాలేరు అయ్యారా..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్..

Published Date :July 9, 2025 , 7:38 pm
By RAMAKRISHNA KENCHE
CM Revanth Reddy: ఆంధ్రా పక్షాన పాలేరు అయ్యారా..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ ఉద్యమంలో సర్వం ఒడ్డి కొట్లాడిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారని.. పార్టీల కంటే ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పే వాళ్లే ఇక్కడ ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అజెండా ఎలా ఉంది.. రాజకీయ ఆర్థిక ప్రయోజనం ఏం పొందారు అనేది చర్చనీయాంశం కాదని.. ఇక్కడ తొమ్మిదిన్నరేళ్ళు.. కేసీఆర్ కుటుంబమే ఇరిగేషన్ శాఖ చూసిందన్నారు. ఐదేళ్లు ఆర్థిక శాఖ హరీష్ రావు దగ్గర ఉందని.. నీళ్లు.. నిధులు ఆ కుటుంబం దగ్గరే ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ విచిత్ర వాదన తీసుకుని ముందుకు వస్తున్నారని… ఏడాది లోనే సర్వం నాశనం అయ్యిందంటూ వితండ వాదం చేస్తుందని మండిపడ్డారు. దీన్ని సెట్ చేయాలి అంటే తామే అధికారంలో ఉండాలి అన్నట్టు వితండ వాదం చేస్తున్నారన్నారు. అందుకే.. సభలో చర్చ పెడదామన్నారు. అవసరం ఐతే.. నాలుగు రోజుకు చర్చ పెడదామని స్పష్టం చేశారు.

READ MORE: PM Modi: ప్రధాని మోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం..

విధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా.. సభలో చర్చ చేద్దాం అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ అనుభవం తీసుకుందామని సభకి రండి అని అడిగిగానన్నారు. ఒకాయన.. పేరు కూడా ప్రస్తావన అవసరం లేని వ్యక్తి ఏం మాట్లాడారో తెలుసని.. తాను నోరు విప్పితే.. ఆయనకు ఎట్లా సమాధానం చెప్తానో కూడా మీకు తెలుసన్నారు. కానీ ఆయనకి అంత స్థాయి లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డిని పిలిచి.. సలహాలు ఇచ్చి.. జీవోలు ఇచ్చేలా కేసీఆర్ సహకరించారని ఆరోపించారు. జగన్, కేసీఆర్ మధ్య ఏముంది అనేది అనవసరమని.. కానీ ప్రజల హక్కులు కాల రాసే హక్కు ఆయనకు ఇవ్వలేదన్నారు. కృష్ణా లో నీళ్ళు తెలంగాణలోకి వచ్చిన వెంటనే ఒడిసి పట్టాల్సిందని.. వచ్చిన దగ్గర వదిలేసి.. కర్నూలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత పట్టుకుంట అంటున్నారన్నారు. రాయలసీమ..నీటి దారి దోపిడీకి సహకరించింది కేసీఆర్ అని సీఎం ఆరోపించారు. జూరాల దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి అంటే చిన్నారెడ్డిని ఏం చదువుకున్నావు అని కేసీఆర్ తిట్టారని గుర్తు చేశారు. చిన్నారెడ్డి సౌమ్యుడు కాబట్టి మాట్లాడలేదని.. ఆ రోజే కేసీఆర్ చిన్నారెడ్డి మాట వింటే.. నీళ్ల దోపిడి జరిగేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు.

READ MORE: PVN Madhav: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు.. కీలక అంశాలపై చర్చ!

“పాలమూరు ప్రాజెక్టుకి 2 టీఎంసీల నుంచి ఒక టీఎంసీ చేశారు. అంచనాలు పెంచారు.. నీళ్లను మాత్రం తగ్గించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఏడాదికి 1km తవ్వినా ఇప్పటికి పూర్తి అయ్యేది. రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయేది.. కానీ ఇప్పుడు అది రూ. 3 వేల కోట్లకు పెరిగింది. కేసీఆర్ నిర్లక్షం వల్ల హక్కులు రాలేదు… వాటా లేదు. మేము సరిదిద్దాలి అని పని మొదలుపెడితే.. తప్పుదోవ పట్టించడానికి పని మొదలుపెట్టారు. తప్పులకి కొరడా దెబ్బలు కొట్టాలి వస్తె.. కేసీఆర్ ని వంద కొరడా దెబ్బలు కొట్టాలి. చేసిందే తప్పు.. మళ్ళీ మాపై నిందలు వేస్తున్నారు. కోర్టు కేసులకు అడ్వకెట్లతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని కేసీఆర్ ఎట్లా అంటారు. వాళ్ళ పక్షాన పాలేరు అయ్యారా..? చర్చ చేద్దాం అంటే.. సభకు రారు. పిల్లలు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకు మన వాళ్ళు చాలా మంది సమాధానం చెప్పారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని చెప్పిన కేసీఆర్.. రంగారెడ్డి…నల్గొండ జిల్లాలో 23.24.25 ప్యాకేజీలలో ఆయకట్టు ఎందుకు తగ్గించారు. ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చడానికి కారణం. చేవెళ్ల పేరు పెట్టీ.. చేవెళ్ల నీళ్లు ఇవ్వకపోతే నిలదీస్తారు అని పేరు మార్చారు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: The Paradise : నేచురల్ స్టార్ నాని ‘ది పారడైజ్’ షూటింగ్ అప్ డేట్..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brs vs congress
  • harish rao
  • Irrigation Projects
  • Jalayagnam
  • Kaleshwaram project

తాజావార్తలు

  • Monalisa: శరీరాన్ని అసభ్యంగా తాకేవాడని అమ్మానాన్నకి చెబితే సర్దుకుపోమన్నారు.. మోనాలిసా సంచలన ఆరోపణలు

  • Lightning Strikes: ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా? ఆసక్తికర నిజాలు ఇవే!

  • Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!

  • Nara Lokesh : ఇది తెలుగుదేశం పార్టీ 3.O వర్షన్

  • Reels Craze: లైఫ్ రిస్క్ అయినా ఫరవాలేదు.. ఏక్ దిన్ మే ఫేమస్ హోనా బస్..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions