Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambika Warns Radha Over Rs 46 Crore Cheque Dispute: ప్రముఖ సీనియర్ నటి రాధా కుటుంబంలో ఆస్తులు, వ్యాపారం, బంగారం వ్యవహారాలకు సంబంధించిన వివాదం పోలీసుల వరకు చేరిన విషయం తెలిసిందే. తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్‌పై నటి రాధా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన గదిలో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను దొంగిలించి.. రూ.46 కోట్లను కాజేసేందుకు తన సోదరి, సోదరుడు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి ఇద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాధా తన ఫిర్యాదులో కోరారు.
అయితే రాధా చేసిన ఆరోపణలను ఆమె అక్క అంబిక ఖండించారు. తాను ఎలాంటి చెక్కులను దొంగిలించలేదని స్పష్టం చేశారు. ‘ఐదు చెక్కులను రాధానే నాకు ఇచ్చింది. కుటుంబ ఆస్తులు, వ్యాపారం, బంగారం తదితర అంశాలపై నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునే క్రమంలోనే రాధా ఆ చెక్కులను నాకు ఇచ్చింది. మధురవాయల్‌లోని 50 సెంట్ల స్థలం, ఏఆర్ఎస్ గార్డెన్స్‌లో వాటా, బంగారం వ్యవహారాలకు సంబంధించి మా మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ అంశాలపై గత జూలైలోనే నేను పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని అంబిక చెప్పారు.
Also Read
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
- JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
- Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
‘కుటుంబంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు జరిగిన ఒప్పందంలో భాగంగానే రాధా నాకు ఐదు చెక్కులు ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే చెక్కుల విషయంలో నాపై రాధా తప్పుడు ఆరోపణలు చేస్తోంది. రూ.46 కోట్ల చెక్ వ్యవహారంపై నాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదు. ఒకవేళ రాధా ఇచ్చిన చెక్కులు బ్యాంకులో తిరస్కరణకు గురైతే.. నేను కూడా రాధాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని అంబిక హెచ్చరించారు. మరి అక్క వార్నింగ్‌పై రాధా ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!