అవసరమైతే రోబోలను పంపి.. రెస్క్యూ ఆపరేషన్ లో వాడుకునే దిశగా ప్రయత్నం చేయాలని సూచించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా సానుభూతి తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఈ విపత్తు లో పనిచేస్తున్నాయన్నారు. “ఇది ఒక ప్రమాదం.. ఇది విపత్తు.. అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హెలికాప్టర్ ఇచ్చి మంత్రులు జూపల్లి, ఉత్తమ్ లను ఇక్కడికి పంపాను.. ఎప్పటికప్పుడు రెస్క్యూ సమాచారం తెలుసుకున్నాను.. నిమిషం నిమిషం మానిటరింగ్ చేశాను.. 8 కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం.. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగితే.. నేను వచ్చే ప్రయత్నం చేసాను. నన్ను అరెస్ట్ చేశారు.” అని సీఎం తెలిపారు.
READ MORE: Bike Racing: ఎట్టకేలకు చిక్కిన బైక్ రేసర్లు.. 38 మంది యువకులపై కేసు నమోదు!
“దేవాదులలో ప్రమాదం జరిగి 5 మంది చనిపోతే.. 9 ఏళ్లు ఐనా మృతదేహాలు దొరకలేదు.. ఆ విషయం గత ప్రభుత్వం మరిచిపోయిందా? ప్రమాదం జరిగితే ఎందుకు రాలేదు అని నన్ను ప్రశ్నిస్తున్నారు.. మరి హరీష్ రావు ఏం చేశాడు.. దుబాయ్ వెళ్ళలేదా.. ఒకసారి ఎయిర్పోర్ట్ లిస్ట్ తీయండి.. హరీష్ రావు అబుధాబి వెళ్ళి రెండు రోజులు దావత్ లో మునిగితేలారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేనే లెటర్ రాస్తా.. హరీష్ రావు ట్రావెల్ హిస్టరీ తీయమని.. ప్రమాదం జరిగిన తర్వాత.. హరీష్ దుబాయ్ వెళ్ళలేదు అని చెప్పమనండి. ప్రతిపక్షాలకు దయ్యం పట్టింది.