CM Revanth Reddy: అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం
- దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట
- పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం
- లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని.. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
Read Also: CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Also Read
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థమంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్, ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్‌లకు గుడ్‌న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!