NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కులం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, ముఖ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి , రాహుల్ గాంధీ కులం , మతం గురించి ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం, వారు రాహుల్ గాంధీ తల్లి ఒక క్రిస్టియన్, తండ్రీ ఒక ముస్లిం అయినందున ఆయన కులం ఏది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బీజేపీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు, “రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని” ఆయన విమర్శించారు. ఆయన భారతీయ కాంగ్రెస్ పార్టీలో మతాన్ని లేదా కులాన్ని ప్రస్తావించకుండా ప్రజలను ఐక్యంగా చూడాలని స్పష్టం చేశారు.

అంతేకాక, బీసీ, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలను మోసం చేస్తున్న బీజేపీ నాయకులు, కులగణన (Cast Census) అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు దారి తొలగించే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి, హిందువుల హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. ఇక, తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వాగ్దానం చేస్తున్నారు, అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

BYD Sealion 7: ఒక్క ఛార్జ్‌తో 567 కి.మీ రేంజ్.. అదిరిపోయిన ఫీచర్లు