CM Revanth Reddy: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 జరుగుతోంది. ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో ఇండియా, మారిషస్, సిరియా దేశాలు పాల్గొంటున్నాయి. ఇవాళ ఇండియా వర్సెస్ మారిషస్ మ్యాచ్ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 6న మారిషస్ వర్సెస్ సిరియా, సెప్టెంబర్ 9న ఇండియా వర్సెస్ సిరియా మ్యాచ్‌లు జరగనున్నాయి.
Read Also: Telangana: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ మ్యాచులకు అనుగుణంగా గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫుట్ బాల్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తెలంగాణలో ఫుట్‌బాల్ ఆటను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇంటర్ నేషనల్ మ్యాచులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఫుట్ బాల్ మ్యాచ్‌ల సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు.