NTV Telugu Site icon

CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని.. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ వేశామని.. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని తెలిపారు. డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలో రైతు పండుగ జరిగిందని.. రైతులు ప్రభుత్వానికి గొప్ప శక్తి.. వారి ఆశీర్వాదంతో ఇంధనం వచ్చిందని భావిస్తామన్నారు. ఏ జిల్లా అయితే నిండు మనస్సుతో ఆశీర్వదించిందో భవిష్యత్‌లో కూడా అలానే కొనసాగుతోందన్నారు. జూన్ 2, 2014 నాటికి 16 వేల కోట్ల మిగులు, 69 వేల కోట్ల అప్పు లతో కేసీఆర్‌కు యూపీఏ ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందన్నారు. నాడు ప్రజలకు వాస్తవాలు ఎవరూ చెప్పలేదు.. పాలకులు వివరించలేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగితే ప్రతిదాడి చేశారన్నారు.

Read Also: Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని రేపు నిర్ణయిస్తారు.. షిండే కీలక వ్యాఖ్యలు..

డిసెంబరు 9న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. రూ.6500 కోట్లు నెలకు అసలు, వడ్డీ ప్రభుత్వం కడుతోందన్నారు. నెల నెలా అప్పులు కడుతూనే సంక్షేమ కార్యక్రమాలు ఆపడం లేదన్నారు. నేతల తలరాతలు మార్చేది రైతులేనన్నారు. నెహ్రూ నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు రైతు సంక్షేమం కోసం పని చేశారన్నారు. అయిన రైతుల తలరాతలు బాగుపడలేదన్నారు. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధును మేమే ఇచ్చామన్నారు. రూ.7725 కోట్ల రైతు బంధు మొదటి విడత ఇచ్చామని.. 22 లక్షల22వేల 67 మందికి రుణమాఫీ చేశామన్నారు. 30.5.24 న రెండో విడత రుణమాఫీ చేశామని.. మూడోసారి 4లక్షల 46 వేల 836 మందికి మాఫీ చేశామన్నారు. నిన్న రూ.2,747 కోట్లు నాల్గో విడతగా సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఆగిపోయిన వారికి మాఫీ చేశామన్నారు. మొత్తంగా 25 లక్షల 36 వేల 964 రైతు కుటుంబాలకు రూ. 20, 616 కోట్లు రుణమాఫీ చేశామన్నారు.

ఇప్పటి వరకు ఎవరు చేయలేదని.. దేశంలోనే ఇది గొప్ప రికార్డు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ తామే గొప్పగా రుణమాఫీ చేశామని చెబుతున్నారన్నారు. రైతులు అప్పులు చేసి మిత్తిలు కట్టారని.. రుణమాఫీ కాక ఇబ్బందులు పడ్డారన్నారు. 20 లక్షల మంది కొత్తగా రుణాలు తీసుకోలేదని.. పాత వాటినే రెన్యూవల్ చేసుకున్నారన్నారు. మాది రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. రైతు బంధు బకాయిలు ఇచ్చామన్నారు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు బంధు వేస్తామన్నారు. మారీచుడు, సుబాబులు వచ్చి అడ్డుకున్నా.. రైతు భరోసా వేస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో మారీచులు వస్తారని… ఎవరు ఆందోళన చెందవద్దని, ఎవర్ని నమ్మవద్దన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని, నివేదికను సభలో పెట్టి చర్చిస్తామన్నారు. డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా వేస్తామన్నారు.

Read Also: Arvind Kejriwal: కాంగ్రెస్‌తో పొత్తుపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. గతంలో వరి వేసుకుంటే ఉరే అని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని.. ఆ పరిస్థితి నుంచి వరి వేసుకుంటే.. అందులో సన్నాలు వేసిన వారికి 500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఇచ్చామని… ఎవరు వచ్చినా ఉచిత విద్యుత్ ఇవ్వక తప్పని పరిస్థితి ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా సన్నాలకు బోనస్ కొనసాగుతుందన్నారు. తెలంగాణలో తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ బియ్యాన్ని ఎక్కువగా తింటారన్నారు. విద్యార్థులకు తెలంగాణ నేల మీద పండిన బియ్యాన్ని అందిస్తామన్నారు. రైతులు నాణ్యమైన సన్నాలు పండిస్తే పేదలకే అందిస్తామన్నారు. పథకాలు అమలు చేస్తున్న విధానం కూడా ప్రజలకు, రైతులకు తెలియాలన్నారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. వ్యవసాయం దండగ కాదు పండుగ చేస్తామన్నారు. కిషన్ రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధమని ప్రశ్నించారు. గుజరాత్‌లో అన్ని రకాల మద్యం బ్రాండ్లు దొరుకుతాయన్నారు. బీజేపీ గడిచిన మూడు పర్యాయాల మేనిఫెస్టోలతో ముందుకు వస్తే మేము మా మ్యానిఫెస్టోలతో చర్చకు సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.