CM Revanth Reddy : ప్రభాస్ లేని బాహుబలిని ఊహించలేం.. ప్రభాస్ హాలీవుడ్‌తో పడేలా రాణిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో అన్ని రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని, రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు.. ఇందుకు వారి శ్రమ,పట్టుదలే కారణమన్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజు అని, ఇప్పుడు హాలీవుడ్ తో పోటీ పడేలా రాణించిన బాహుబలి ప్రభాస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కఠోరమైన శ్రమ, పట్టుదల కారణంగానే వివిధ రంగాల్లో క్షత్రియులు రాణించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు అత్యంత క్రియాశీల పాత్ర పోషించారని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారన్నారు. పార్టీ కోసం కష్టపడిన బోసురాజు ని రాహుల్ గాంధీ గారు గుర్తించారని, వారి నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ వారిని మంత్రిని చేశారన్నారు. నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఉంటుందనడానికి బోసురాజు, శ్రీనివాస వర్మ ఒక ఉదాహరణ అని, మీలో రాజకీయాల్లో రాణించాలని ఉన్నవాళ్లను మీరు ప్రోత్సహించండన్నారు.
Sivaji-Laya: మరోసారి జంటగా శివాజీ-లయ.. 14 ఏళ్ల తర్వాత..
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని క్షత్రియ సోదరులకు మాట ఇస్తున్నా అని ఆయన అన్నారు. మీ తరపున తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా శ్రీనివాస రాజు ఉన్నారని, మీ సమస్యలను వారి ద్వారా నా దృష్టికి తీసుకురండన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా..’ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్ గా శ్రీని రాజును నియమించాం.. ఇది క్షత్రియులపై మాకున్న నమ్మకానికి నిదర్శనం.. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్పూర్తితో మేం ప్రజా సమస్యలపై కొట్లాడాం.. హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియులు కూడా భాగస్వాములే. క్షత్రియులకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని రాజులందరికి నేను పిలుపునిస్తున్నా.. రండి.. ప్రభుత్వం మీకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది.. క్షత్రియ భవన్ కు కావాల్సిన స్థలం, అవసరమైన సహకారం మా ప్రభుత్వం అందిస్తుంది.’ అని సీఎం రేవంత్ రెడ్డి.
Komatireddy Venkat Reddy : మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!