Revanth Reddy: విద్యావ్యవస్థకు కొత్త రూపురేఖలు తీసుకొస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే గ్రూప్-1 పరీక్షను నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీలో కూడా నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్‌రావు) మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని చెప్పుకొచ్చారు. నువ్వు రాజీనామా చెయ్ తాను చేసి చూపిస్తానంటూ హరీశ్‌రావు అంటున్నారన్నారు. హరీష్ రావును చూస్తుంటే మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారని.. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుదని గుర్తుచేశారు. పదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్‌రావు ఏం చేశారు? అని సీఎం నిలదీశారు.
మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు. 3,650 రోజులు అధికారంలో ఉండి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25 వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టామని.. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? అని రేవంత్‌రెడ్డి అడిగారు.
బీఆర్‌ఎస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారని తెలిపారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసిందని ఆరోపించారు. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకొస్తామని ప్రకటించారు. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కొడంగల్‌లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని.. ఈ మోడల్‌ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామని వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో దీనికి కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!