DSC 2024: ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందచేసిన సీఎం రేవంత్ రెడ్డి
- కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నాం
- సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నారు
- కానీ గత ముఖ్యమంత్రి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలేదు
- తండ్రీకొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు కొలువులు వస్తున్నాయి
- మా ప్రభుత్వ వచ్చాక విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం
- 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం
- ఏదో రకంగా నోటిఫికేషన్లు అడ్డుకోవాలని కుట్రలు చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందచేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మిమ్మల్ని చూస్తోంటే దసరా పండగ మూడు రోజుల ముందే వచ్చినట్లుందన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గత పదేళ్లు కోరి కొరివిదెయ్యాన్ని తెచ్చుకున్నారని, ఆ కొరివి దెయ్యాన్ని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ మూడేళ్లు ఆలస్యంగా 2017లో ఇచ్చారని, నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్ల తరువాత 2019 నియామకాలు జరిపారన్నారు. తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు మాట ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేం అధికారంలోకి వచ్చిన 90రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 ఉపాధ్యాయ నియామకపత్రాలు అందిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
EV Charging Rates : ToD టారిఫ్ సిస్టమ్ ప్రకారం తెలంగాణలో EV ఛార్జింగ్ రేట్లు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
అంతేకాకుండా..’తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర కీలకం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో 34వేల మంది టీచర్ల బదిలీలతో పాటు 21వేల మంది టీచర్లకు పదోన్నతులు అందించాం.. కొన్ని కొరివి దెయ్యాలు మీకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నం చేశాయి.. మీ కుటుంబాల్లో సంతోషాన్ని చూసేందుకు అన్నింటినీ ఎదుర్కొని మీకు నియామకపత్రాలను అందజేస్తున్నాం. మీ సంతోషం చూసి కొంతమంది కండ్లల్లో కారం కొట్టుకుంటున్నారు.. గత పదేళ్లలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ .. పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయలేదు?.. వాళ్లు సలహాలు ఇవ్వరు… కానీ మేం చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు.. ఇవాళ్టి కార్యక్రమం జరగొద్దని కుట్రలు చేసిండ్రు.. పదేళ్లు ఏలిన వారు పది నెలల మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు.. ఆ అవకాశం తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వరు.. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది.. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు..
నాతో పాటు ఇక్కడున్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్ళమే.. తెలంగాణలో 30వేల పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు.. తెలంగాణలోని 10వేల పాఠశాలల్లో 34లక్షల మంది చదువుకుంటున్నారు.. ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావిస్తున్న పరిస్థితికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం.. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.. ఈ నెల 11న పనులు ప్రారంభించుకోబోతున్నాం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా వ్యవస్థను తయారు చేస్తాం. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టాం.. తెలంగాణలో ప్రతీ ఏటా 1లక్షా 10వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు.. కానీ ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు… అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించబోతున్నాం. త్వరలో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు… తెలంగాణ పునర్మిర్మాణానికి మీవంతు కృషి చేయండి..’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!