Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు ఏం జరిగిందంటే?
- కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ
- కొడుకు వివాహం నిశ్చయించిన తర్వాత, తన కాబోయే కోడలితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడేవాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో కాబోయే అల్లుడితో అత్త పారిపోవడం, కాబోయే కోడలిని మామ పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాంపూర్‌లోని ఓ మామ తనకు కాబోయే కోడలిని వివాహం చేసుకున్నాడు. బన్సనాలి గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు పిల్లల తండ్రి తన మైనర్ కొడుకు వివాహాన్ని మొదట బలవంతంగా ఒక అమ్మాయితో నిశ్చయించి, ఆ తర్వాత అదే అమ్మాయితో పారిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొడుకు వివాహం నిశ్చయించిన తర్వాత, మామ తన కాబోయే కోడలితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడేవాడని, క్రమంగా అది వీడియో కాల్‌కు దారితీసిందని చెబుతున్నారు.
Also Read:Air India: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు బెదిరింపులు.. బెంగళూరు వైద్యురాలు అరెస్ట్
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
సమాచారం ప్రకారం, బన్సాంగ్లి గ్రామానికి చెందిన షకీల్ అనే వ్యక్తి తన మైనర్ కొడుకు వివాహం సమీపంలోని ఖేంపూర్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో కుదిర్చాడు. ఈ సంబంధానికి కుటుంబం అభ్యంతరం చెప్పినప్పుడు, షకీల్ తన భార్య, పిల్లలను కొట్టి ఈ సంబంధానికి ఒప్పించాడు. పెళ్లి నిశ్చయమయ్యాక తన భర్త షకీల్ కాబోయే కోడలు ఫోన్ లో మాట్లాడుకోవడ ప్రారంభించారని అతని భార్య తెలిపింది. వీడియో కాల్స్ కూడా చేసుకునే వారని తెలిపింది. దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు షకీల్ నాపై పిల్లలపై దాడికి పాల్పడేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read:Netanyahu: ఆమెరికా ఆదేశాల కోసం ఎదురుచూడలేం.. అణు స్థావరాలను మేమే ధ్వంసం చేస్తామన్న నెతన్యాహు
తన భర్త రూ. 2 లక్షల నగదు, ఒకటిన్నర తులాల బంగారంతో ఇంటి నుంచి పారిపోయాడని షకీల్ భార్య చెప్పింది. నా భర్త నా కొడుకుతో వివాహం నిశ్చయించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎవరి నుంచి న్యాయం కోరుకోవాలి?అని షకీల్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది. నాకు కాబోయే భార్యతో పారిపోయి ఆమెను వివాహం చేసుకుని సమాజంలో తలెత్తుకోకుండా చేశాడని షకీల్ కుమారుడు చెప్పాడు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!