NTV Telugu Site icon

CM Revanth: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం కీలక వ్యాఖ్యలు..

Cm Revanth

Cm Revanth

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలనేది తన అభిమతం అన్నారు. కేటీఆర్‌తోని కేసీఆర్ ఉనికి లేకుండా చేశాను.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడానికి ఆయన కొడుకునే వాడానని అన్నారు. ఇక భవిష్యత్తులో కేటీఆర్‌ని రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్ రావుని వాడుతానని తెలిపారు. మరోవైపు.. మూసీ పై అఖిలపక్షానికి రెడీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు తనను కలవడం ఇష్టం లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైనా మూసీ పైనా అభిప్రాయాలు ఇవ్వండని సూచించారు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి.. ఎలాంటి అభిప్రాయాలనైనా తీసుకోవడానికి తాను రెడీగా ఉన్నానని సీఎం చెప్పారు.

Bangladesh: షేక్ హసీనా లగ్జరీ ప్యాలెస్.. ఇప్పుడు ‘‘విప్లవ మ్యూజియం’’..

చర్చ జరగకుండా అభివృద్ధి జరగదు.. తాను మూసీ పై చర్చ జరగాలని కోరుకుంటున్నాను.. అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. అఖిలపక్షానికి మీరు వస్తే కచ్చితంగా మూసీ పై అఖిలపక్షం పెడతానని అన్నారు. మూసీలో జీవించడానికి.. మూసీ పక్కన ఉండడానికి ఎవరికి ఇష్టం ఉండదు.. మూసీలో లగ్జరీ ఉంటుందా అని సీఎం పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు. మూసీ జనాలను మూసీలోనే ఉండాలని కోరుకుంటున్నారా.. ఈటల రాజేందర్ మూసీ పైన చేస్తున్న అభ్యంతరాలు నిర్మాణాత్మకంగా లేవు.. అతనిపైన కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడి ఉందని సీఎం తెలిపారు. మూసీ పునర్జీవం కోసం రూ. 1,50,000 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెడుతున్నారు అనేది నిజం కాదు.. నిధులన్నీ ప్రైవేటు సంస్థలతోనే సమీకరించి వాళ్లతోనే ఖర్చు చేయించి మూసీని సుందరీకరణ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Ram Pothineni: మహేష్ బాబుతో రామ్ పోతినేని.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

మరోవైపు.. కేసిఆర్, కేటీఆర్ బామ్మర్దులు పార్టీలు చేసుకోవడానికి ఫార్మ్ హౌస్‌లు ఉన్నాయి.. మూసీ పక్కన సామాన్య ప్రజలు దుర్భర జీవితం గడపాలా అని అన్నారు. గండిపేట ఏరియాలో ఫామ్ అవధులు కట్టుకొని మీ కాలుష్యం అంతా మూసీ పైన వదులుతున్నారు.. వాళ్లు ఆ కాలుష్యంతో బతకాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పుడు నాలుగు గోడల మధ్య పరిమితమై ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యాడు అంటే అది తన వల్లే అయిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేటీఆర్‌ని బయటికి తీసుకొచ్చి తండ్రిని ఫామ్ హౌస్ పరిమితం చేశాని ముఖ్యమంత్రి తెలిపారు.

Show comments