Kerala: వయానాడ్‌లో సీపీఐపై రాహుల్ పోటీ.. కేరళ సీఎం సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయానాడ్‌లో పోటీ చేయడంపై కేరళ సీఎం పినరయి విజయన్ హాట్ కామెంట్స్ చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేతిలో ఓడిపోతానని తెలుసుకున్న రాహుల్.. కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారని ఆయన ఆరోపించారు. ఇక, వయానాడ్‌లో కమ్యునిస్టుల మద్దతుతో రాహుల్ గాంధీ ఎంపీగా విజయం సాధించారని పేర్కొన్నారు. కాగా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మరోసారి వయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీతో పొత్తులో భాగంగా వయనాడ్ పార్లమెంట్ సీటును సీపీఐ జాతీయ నాయకురాలు అన్నీ రాజాకు కేటాయించింది. అయినా కూడా ఇదే స్థానం నుంచి మరోసారి పోటీకి రాహుల్ రెడీ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.
Read Also: Ranbir Kapoor-Rashmika: మరోసారి రణ్‌బీర్-రష్మిక కాంబో!
Also Read
ఇక, కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కేరళకు వచ్చి అన్నీ రాజాపై పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. మణిపూర్ సమస్య సమయంలో బీజేపీ ప్రభుత్వ అకృత్యాలను తీవ్రంగా ఎండగట్టినందుకు ఆమెను దేశ వ్యతిరేకి అనే ముద్ర వేశారన్నారు.. దేశం ఇలాంటి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు అన్నీ రాజా అక్కడ ప్రత్యక్షం కావడం మనం నిత్యం చూస్తూనే ఉంటామన్నారు. కానీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎక్కడైనా చూశామా? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో నిర్ణయించుకోండి అని సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!