డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇవాళ (శనివారం) ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఛాయ్ దుకాణంలోకి వెళ్లి.. అక్కడ ఛాయ్ పెట్టించుకుని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాగారు.