పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ ఉప ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జి భవానీపూర్ నుంచి బరిలో దిగనున్నారు. ఇక షంషేర్ గంజ్ నుంచి అమీరుల్ ఇస్లాం, జాంగీర్‌పూర్ నుంచి జాకీర్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న మూడు నియోజకవర్గాలకు… సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. కాగా.. మూడు రోజుల క్రితమే ఈ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.