తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. రోజుకు మూడు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మూడో సారి రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగుతున్నాయని, 75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ప్రజా స్వామ్య పరిణితి రావాల్సిన స్థాయిలో రాలేదు. ఏ దేశాల్లో వచ్చిందో అవి మనకంటే ముందుకు వెళ్లిపోతున్నాయి. అభివృద్ధి కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో నేను చెప్పిన మాటలు చర్చ పెట్టాలని, 30న ఓట్లు పడుతాయి. 3న లెక్కిస్తారు. ఎవరో ఒకరు గెలుస్తారన్నారు సీఎం కేసీఆర్.
అంతేకాకుండా.. ‘వజ్రాయుధం మీ ఓటు. మీ నిర్ణయాధికారంలో ఉండే ఓటు గొప్పది. ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభం, ఏ పార్టీ గెలిస్తే లాభం అనే దానిపై చర్చ జరుగాలి. ఎన్నికలు కాగానే ఆగమై గతంలో మంచి చేసిన పార్టీని మరువద్దు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలిస్తే మీకు లాభం జరుగుతుంది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. వారి హక్కులు కాపాడటం కోసం. తెలంగాణకు కాపలదారే బీఆర్ఎస్. చావునోట్లో తలకాయ బెట్టి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా?. నిర్మల్ కు జిల్లా తెచ్చిన వ్యక్తి ఇంద్రకిరణ్ రెడ్డి. ఆదిలాబాద్ ను నాలుగు జిల్లాలు చేయాలని చెప్పిన వ్యక్తి ఇంద్రకిరణ్ రెడ్డి. అవే మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్. నాలుగు జిల్లాల్లో నాలుగు మెడికల్ కాలేజీలు పెట్టించినం. ఇంద్రకిరణ్ రెడ్డి పుట్టిన ప్రాంతం నిర్మల్ కాబట్టి ప్రేమ ఉంది. సభతో ఇంద్రకిరణ్ రెడ్డి గెలిచిపోయిండని సభను చూస్తే తెలిసిపోతుంది. 70 నుండి 80 వేల మెజారిటీతో గెలిపించండి. ఇంజనీరింగ్ కాలేజి చేపించే బాధ్యత. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కర్ఫ్యూలేదు. మత కల్లోహాలు లేవు. ఇటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులపై కత్తులతో దాడులు చేస్తున్నారు. దుర్మార్గమైన సంస్కృతి తయారు చేస్తున్నారు.
దళిత సమాజం అణిచివేయబడి ఉంది. అంటరానితనం అనే వివక్షకు గురైంది. నెహ్రూగారి నుంచే వీరి సంక్షేమం పెట్టి ఉంటే దళితుల పరిస్థితి ఇలా ఉండేది కాదు. దళితబంధు అనే స్కీం పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. దళిత సమాజాన్ని ఉద్దరించాలన్నదే మా లక్ష్యం పోడు పట్టాలు గిరిజనులకు ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. రైతుబంధు అనే పదం పుట్టిందే కేసీఆర్ నోటి నుంచి. కరెంటు ను బాగా చేసినం .నిర్మల్ నియోజకవర్గంలో 15 సబ్ స్టేషన్లు కట్టుకున్నాం. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయం స్థిరీకరణ చేయాలని భావించాం. రైతుబంధు కోసం ఎవరూ ధర్నా చేయలేదు. నీటి తీరువా రద్దు చేశాం. నీళ్లు ఉచితమే, కరెంటు ఉచితమే. పండిన పంటను ప్రభుత్వమే కొంటూ ఉన్నది. రుణమాఫీ చేసుకున్నాం. అంజుమాన్ అప్పులు బాకీ ఉంటే రైతుల ఇండ్ల తలుపులు గుంజుకుపోయారు. ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల పన్నును దుబారా చేస్తూ రైతుబంధు ఇస్తున్నడని చెబుతున్నాడని అన్నారు. పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. కరెంటు 24 గంటలు వేస్ట్ గా ఇస్తున్నాడని అన్నాడు. 3 గంటలు ఇస్తే చాలు అంటున్నాడు. ధరణి పోర్టల్ తెచ్చినం. ఇది వద్దు అని కాంగ్రెస్ అంటుంది. లంబాడ హక్కుల పోరాట సమితి మావనాటే మావరాజ్ అంటూ మాట్లాడేవారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినం. పోడు పట్టాలు 4 లక్షల ఎకరాలు ఇచ్చాం. త్రీఫేజ్ కరెంటు కూడా ఇస్తున్నాం.
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే వాళ్లకు రైతుబంధు మీద ఇష్టం లేదు. 24 గంటలు కరెంటు ఇవ్వడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి ముందుకు వెళ్తుంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్మల్, ముథోల్, ఆదిలాబాద్ వచ్చాను. భగవంతుడి దయ ఉంటే తెలంగాణ పక్కా వస్తుందని ఆనాడు చెప్పాను. వచ్చింది. కులమతాలకు అతీతంగా అందరినీ తమతో తీసుకువెళ్తున్నాం. అందరి ముఖాల్లో నవ్వు చూడాలి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ముస్లీంలకు విద్య అందిస్తున్నాం. కేసీఆర్ ప్రాణంతో ఉన్నంత వరకు శాంతిభద్రతలు ఉంటాయి. ఎన్నికల తర్వాత నిర్మల్ నియోజకవర్గానికి లిఫ్టు ఇస్తాం. కొత్త మ్యానిఫెస్టో మీ ముందుంది. బాగుంది. త్వరలో 4 కోట్ల ధాన్యం పండించి పంజాబ్ ను దాటి పోతుంది. విధివంచితులను ఆదుకునే బాధ్యత సమాజం మీద ప్రభుత్వం మీద ఉంటుందని పెన్షన్ ను పెంచుకున్నాం. రైతుబంధు మార్చి తర్వాత 12 వేలు అవుతుంది. ఐదేళ్లలో 16 వేలకు పోతుంది. రేషన్ కార్డు ఉన్నవారికి భీమా చేయాలని నిర్ణయించాం. అర్హులైన మహిళకు నెలకు రూ. 3 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. చెప్పిన మాటలు ఇక్కడ వదలకుండా చర్చించి నిజాల వైపు నిల్చుని న్యాయం వైపు నిలువాలని కోరుతున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే ఓటు వేయండి. ‘ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.