బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. అదేసమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నేడు కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం బీఆర్ఎస్ ప్రజా ఆశీరాధ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కామారెడ్డి ప్రాంతమన్నారు. తెలంగాణ కోసం బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని గంప గోవర్ధన్ చాలా సార్లు అడిగారని, రెండేళ్లలో కాళేశ్వరం పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు సీఎం కేసీఆర్.
అంతేకాకుండా.. ‘కామారెడ్డి ఎల్లారెడ్డి కి సాగు నీరు అందిస్తాం. ప్రజా స్వామ్యంలో ప్రజలకు ఉండే ఆయుధం ఓటు. విచక్షణ తో ఓటేయాలి. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఎం చేసింది. కాంగ్రెస్ పాలనలో దళితులు అణిచివేతకు గురయ్యారు. నెహ్రు హయాంలో దళిత బంధు పెట్టి ఉంటే దళితులు అబివృద్ది చెందేవారు. త్వరలో బీడీ పింఛన్ 5 వేలు. లక్ష మంది కొత్త బీడీ కార్మికులకు పింఛన్ అమలు చేస్తాం. రైతు బంధు దుబారా అనే పార్టీ లకు ఓటేస్తారా. ఒక్క మెడికల్ కాలేజి ఇవ్వని బీజేపీ కి ఓటెయొద్దు. 50 లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్ ను కేటీఆర్ పై పోటీ కి పెడతారా. ఎవరిని గెలిపిస్తారో ప్రజలు ఆలోచించాలి.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.