వీఆర్ఏలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వీఆర్ఏలను, వారి వారి విద్యార్హతలను, సామర్థ్యాలను బట్టి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని, వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.
Also Read : Priyanka Jawalkar: సెల్ఫీ గేమ్ అంటూ రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. క్లీవేజ్ షోతో ప్రియాంక ట్రీట్
మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తో కూడిన మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బుధవారం నుంచి మంత్రి వర్గ ఉప సంఘం చర్చలు జరపనున్నాయి. చర్చల అనంతరం ఉప సంఘం సూచనల ప్రకారం.. నిర్ణయాలు తీసుకోని వీఆర్ఏల సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉప సంఘం కసరత్తు పూర్తై..తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read : Off The Record: ఎన్డీఏ స్టీరింగ్ కమిటీ మీటింగ్.. జనసేనను పిలిచారా?