MLA G Sayanna : ఎమ్మెల్యే సాయన్న మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్నను ఇవాళ ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయన్న తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా సాయన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలిచారు. టీడీపీ తరుఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలుపొందారు. రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. సాయన్న మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న.. చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని, సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నిరంతరం శ్రమించే నాయకుడు : మంత్రి కేటీఆర్..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే గొప్ప నాయకుడు సాయన్న. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరం : ఈటల
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నానన్నారు.
సాయన్న అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారు : కిషన్ రెడ్డి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. సాయన్న గారు అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరం : మంత్రి గంగుల
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!