CM Jagan : నేడు వైఎస్సార్ జయంతి.. మధ్యాహ్నం ఇడుపులపాయకు సీఎం జగన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని వైఎస్ ఘాట్‌లో నివాళులర్పించనున్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వైఎస్ షర్మిల, విజయలక్ష్మి ఇడుపులపాయకు చేరుకున్నారు. అయితే.. మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయకు సీఎం జగన్ చేరుకోనున్నారు. అనంతపురంలో రైతు భరోసా నిధులు విడుదల చేసి నేరుగా ఇడుపులపాయకు సీఎం జగన్ చేరుకుంటారు. ఈ సందర్భంగా వైఎస్ ఘాట్ దగ్గర నివాళులర్పించనున్నారు జగన్. అయితే.. సీఎం జగన్ 3 రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు కార్యక్రమం పూర్తయ్యాక ఇడుపులపాయలో తన నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకుంటారు.
Also Read : Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఇంధన సంక్షోభం.. అన్నీ మూసుకు కూర్చుంది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గండిపేట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం జగన్ పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్ ఫ్రెంట్ చేరుకుని కెనాల్ డెవలప్‌మెంట్ ఫేజ్ –1 పనులను ప్రారంభించనున్నారు. పులివెందులలోని నూతనంగా నిర్మించిన వైఎస్సార్ ఐఎస్‌టిఏ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు.
Also Read : No Leave in 74 Years: సూపర్ వుమెన్.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!
కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు. జులై 10న ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి జగన్ కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తికి జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!