ఏపీ సీఎం జగన్ ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పర్యవేక్షించారు. అయితే.. ఈ నెల 27న సీఎం వైయస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా.. ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి.
Also Read : SP Anburajan : అనూష ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే
10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకోనున్నారు. 11.10 – మధ్యాహ్నం 1.10 గంటల వరకు నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.