విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మిషన్లు.. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రపంచ వేదికపై మన విద్యార్థులు ఆంధ్రా జెండా ఎగరవేయాలి.. మన పిల్లలు ప్రపంచస్థాయిలో రాణించాలన్నారు సీఎం జగన్. ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మొదటి విడత విద్యా దీవెన సహాయం అందచేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 213 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరనుంది. మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లు విడుదల చేశారు సీఎం. లబ్ధిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేశారు సీఎం వైఎస్ జగన్. ఏటా 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ. 1.25 కోట్ల వరకు 100 శాతం ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్. మిగిలిన వారికి గరిష్టంగా రూ. 1 కోటి వరకు ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుందన్నారు సీఎం జగన్.
Read Also: Child Marriages: బాల్యవివాహాలు చేసుకుంటే అరెస్టులే.. సీఎం సంచలన ప్రకటన
100 నుండి 200 క్యూఎస్ ర్యాంకులు పొందిన యూనివర్శిటీలలో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ. 75 లక్షల వరకు ట్యూషన్ ఫీజు రీఎంబర్స్‌మెంట్. మిగిలిన విద్యార్ధులకు గరిష్టంగా రూ. 50 లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లింపు. విదేశీ విశ్వవిద్యాలయానికి వెళ్ళే విద్యార్ధులకు విమాన, వీసా ఛార్జీలు సైతం రీఇంబర్స్‌మెంట్ చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమను సంప్రదించవచ్చన్నారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నారు. విదేశీ విద్యాదీవెన కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యయంగా నిలిచిపోతుంది. మీకు మద్దతుగా పూర్తిగా సహకారాలు ఈ ప్రభుత్వం అందిస్తోంది.
కార్నిగీ మిలన్ యూనివర్శిటీ రూ. కోటి 16 లక్షల ఫీజు, సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ కోటి రూపాయల ఫీజు, బోస్టన్ యూనివర్శిటీ రూ. 97 లక్షల ఫీజు, హార్వర్డ్ యూనివర్శిటీ సుమారు రూ. 88 లక్షల ఫీజుగా ఉంది. సామాన్యులు ఎవ్వరూ కూడా భరించే ఫీజులు కావు. ఇలాంటి చోట సీట్లు వచ్చినాకూడా ఈ డబ్బులు కట్టే పరిస్థితి లేదు. తల్లిదండ్రులమీద భారం పెట్టడం ఇష్టంలేక … వెనకడుగు వేసే పరిస్థితులు ఉండేవి. కాని ఈప్రభుత్వం మీతో ఉందన్నారు. మీకు మద్దతుగా నిలుస్తోందన్నారు.
రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద పెట్టుబడి విద్యమీద పెడుతున్నాం. విద్యమీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవనరులమీద పెట్టినట్టే. కుటుంబాల తలరాతలే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారుస్తాయి. మహాత్మగాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి వాళ్లు పెద్ద పెద్ద యూనివర్శిటీలనుంచి వచ్చినవారే. ఇవ్వాళ్టి పెద్ద పెద్ద కంపెనీల్లోని సీఈఓలు నుంచి మొదలుపోడితే.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌వరకూ కూడా పెద్ద పెద్ద యూనివర్శిటీలనుంచి వచ్చినవారే. ఆస్థాయిలో కలలను మీరు నిజంచేయాలి. దేశం ప్రతిష్టనే కాదు, రాష్ట్ర ప్రతిష్టనుకూడా పెంచాలి. మంచి యూనివర్శిటీలో సీటు వస్తే.. డబ్బులు కట్టలేక వెనకడుగు వేసే పరిస్థితి రాకూడదనే ఈ పథకం తెచ్చామన్నారు సీఎం జగన్. బెస్ట్ యూనివర్శిటీలు, బెస్ట్ కాలేజీల్లో సీట్లు వచ్చినవారికి ప్రభుత్వం అండగా నిలిచింది.
Read Also: Fake coins: బస్తాల్లో నకిలీ నాణేలు.. లెక్కించలేక పోలీసులకు చెమటలు
గతంలో పథకాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధిలేదు. ఆ పరిస్థితులు మార్చాలనే ఉద్దేశంతో కొత్త ఆలోచనతో దీన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు. మన రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు.. ఇలా వాటి రూపురేఖలను మారుస్తున్నాం. పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నాం. పెద్ద యూనివర్శిటీల్లో సీట్లు వస్తే.. వారికి తోడుగా నిలవాలన్న ఆలోచనలో నుంచి ఇది వచ్చింది. సీఎంఓలో ఒక అధికారి నంబర్‌ను మీకు ఇస్తాం. కాల్‌చేసి.. వెంటనే సహాయం తీసుకోవచ్చు అన్నారు.
ప్రతి విషయంలోకూడా మీకు తోడుగా ఉంటాం: