పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఈ సమీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం జగన్ చర్చించనున్నారు. చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయంపై సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం.
Also Read : Married Men: మ్యారేజ్ అయ్యాక లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..
అంతేకాకుండా.. ఇటీవల ఏపీలో కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలు వరద ప్రభావంతో ముంపుకు గురయ్యాయి. ఈ సమావేశంలో భారీ వర్షాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే.. రానున్న మరో రెండు నెలల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉండవచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిపై కూడా సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. జోనల్ వ్యవస్థ ఏర్పాటు, రాష్ట్రపతి ఉత్తర్వుల పునః సమీక్ష పై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. డ్రాఫ్ట్ ప్రతిపాదనల పై ఉద్యోగ సంఘాలతో సీఎస్ నేతృత్వంలోని కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని సెకెండ్ బ్లాక్ లో సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యోగుల క్యాడర్‌లో మార్పులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో జోనల్ పరిధి తదితర అంశాల పై సీఎస్ కమిటీ చర్చించనున్నారు.
Also Read : Shruthi Hasan : ఆ విషయంలో నేను రియలైజ్ అయ్యాను..