టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకుంది.ఈ రెండు సినిమాలలో ఈ భామ తనదైన నటనతో ఎంతగానో అలరించి బ్లాక్ బస్టర్ విజయాలను సాధించింది. ఈ రెండు సినిమాల తరువాత ఈ భామకు వరుసగా అవకాశాలు రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు.కానీ ఈ భామకు ఆశించిన విధంగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తుంది.ఇప్పటికే సలార్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. దీనితో ప్రస్తుతం శృతిహాసన్ ఖాళీగా ఉంది.. ఇది ఇలా ఉంటే కెరియర్ పరంగా ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీగా వున్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తన సినిమాలకు సంబంధించిన విషయాలను అలాగే తన బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ పిక్స్ ను కూడా షేర్ చేస్తుంది.ఇది ఇలా ఉంటే తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయగా అది ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. ప్రతీ రోజూ యుద్దం చేయడం కాదు.. ఇంట్లో ఎంతో సరదగా కూర్చుని స్నాక్స్ తింటూ.. మన పెట్‌లను ఎంతో ప్రేమగా చూసుకోవాలి..నా పెట్ క్లారాతో ఆటలు ఆడుతూ ముద్దులు పెడుతూ నా ఒళ్లో కూర్చోబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను రియలైజ్ అయ్యాను అని చెప్పుకొచ్చింది శృతి హాసన్. అందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారిక తో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో వుంటున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ సలార్ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే ఈ భామకు మళ్ళీ స్టార్ హీరోలతో వరుస ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.