CM Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో నూతన వధూవరులు సాయి సంజన, ఆదిత్య వర్మలను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. గోకరాజు గంగరాజు 2014 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందాడు.