IPS Anjani Kumar : తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా అంజనీకుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అంజనీ కుమార్‌ను ఇన్ చార్జ్ డీజీపీగా నియమించడంతో కొంత మంది కీలక అధికారుల్ని బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా రవిగుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్‌ను నియమించారు. సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, లా అండ్ ఆర్డర్ డీజీగా శాంతికుమార్ జైన్ ను నియమించారు.
Read Also: CS Somesh Kumar: ఢిల్లీలో తెలంగాణ సీఎస్.. పెండింగ్ నిధుల చెల్లింపుపై కేంద్ర కార్యదర్శులతో మీటింగ్
అంజనీకుమార్ పూర్తి స్థాయి డీజీపీ నియామకం చేపట్టాలంటే తన సీనియర్లను దాటాలి. ఆయన కంటే సీనియారిటీ ప్రాతిపదికన ఐదుగురు ఉన్నతాధికారుల పేర్లతో జాబితా ఇప్పటికే యూపీఎస్సీకి చేరింది. వారిలో ముగ్గురిని రాష్ట్రానికి యూపీఎస్సీ సిఫార్సు చేయనుంది. వారిలో ఒకరిని తెలంగాణ సర్కార్ ఎంచుకుంటుంది. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్, 1989 బ్యాచ్‌కు చెందిన హోంశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రవిగుప్తా , 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ జితేందర్, రాజీవ్ రతన్ పేర్లను యూపీఎస్సీకి పంపారు. యూపీఎస్సీ నుంచి షార్ట్ లిస్ట్ అయిన మూడు పేర్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి డీజీపీని నియమిస్తారు. అయితే అంజనీకుమార్ నే పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ క్యాడర్‌కు చెందిన అంజనీకుమార్ స్వస్థలం బీహార్.
Read Also: Police Rules For 31St Night : న్యూ ఇయర్ మజా చేయ్.. కానీ రూల్స్ బ్రేక్ చేస్తే..
మరోవైపు పదవీ విరమణ చేయనున్న మహేందర్ రెడ్డికి మరో పోస్టు ఇచ్చేందుకు టీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ పోస్టును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ హోదాలో నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి ఉన్నవారికి కేబినెట్ హోదా లభించనుంది. మహేందర్ రెడ్డి రిటైరైన తర్వాత ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలుస్తోంది.