NTV Telugu Site icon

CM Revanth Reddy: ఫీజు రీయింబర్స్మెంట్ పై సీఎం శుభవార్త..

Cm

Cm

హైదరాబాద్ జేఎన్టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగోను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరంత ఫీజు రీయింబర్స్మెంట్ పై మా పాలసీ ఏంటని ఆలోచిస్తున్నారు.. కారు ఎంత పెద్దది ఐనా.. దాంట్లో ఇంధనం ఉంటేనే విలువ అని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రం సంక్షేమం మీదనే ఎక్కువ దృష్టి సారిస్తోంది.. అభివృద్ధి రెండో ప్రాధాన్యతగా మారిందని తెలిపారు.

Anant Ambani Wedding: పెళ్లిలో ఎదురుపడ్డ ఐశ్వర్యరాయ్-రేఖ.. రియాక్షన్ ఇదే!

కొంత ఆర్థిక భారంతో రాష్ట్రం ఉందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మొండిబకాయల కింద పడిందని సీఎం రేవంత్ తెలిపారు. మీరంతా ఆలోచించి వన్ టైం సెటిల్మెంట్ కి వస్తే బాగుంటుందన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. శ్రీధర్ బాబుకు అత్యంత సన్నిహితుడు అని చెప్పారు. వన్ టైం సెటిల్మెంట్ చేసే బాధ్యత శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నానన్నారు. ఈ ఏడాది నుంచి చేరే విద్యార్థులకు రెగ్యులర్ గా ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందని తెలిపారు. ప్రతీ ఏటా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్ష మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారని సీఎం చెప్పారు. ఈ లోపం మీలో.. మాలో ఉందన్నారు. దాన్ని గుర్తించి సమస్యను పరిష్కరిద్దామని విద్యార్థులకు సూచించారు.

CM Revanth: గ్రూప్-1పై కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ

ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువతను ఉత్పత్తి చేసే కర్మాగారంగా కాకుండా ఉపాధిని కల్పించే వేదికలుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సివిల్ ఇంజనీర్ల కొరత చాలా ఉంది.. కానీ కొన్ని కాలేజీలు సివిల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఎత్తేసే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్లను తప్పనిసరిగా తయారు చేయండని యాజమాన్యాలకు సూచించారు. లేదంటే భవిష్యత్తులో దేశం ఇబ్బందులకు గురవుతుందన్నారు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ తయారీకి ముందుకు వచ్చిన మూడు కంపెనీలు తెలంగాణలోనివేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.