CM Chandrababu: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

  • పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
  • స్వాగతం పలికిన ఆలయ అధికారులు
Tiruchanur

Tiruchanur

CM Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు. ఆలయం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. పద్మావతి అమ్మవారి దర్శనం ముగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టు బయలుదేరారు.

Read Also: YS Jagan: వైసీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ.. పలు అంశాలపై దిశానిర్దేశం

రేణిగుంట నుంచి చంద్రబాబు విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ దుర్గగుడిలో అమ్మవారికి సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేయనున్నారు. తిరుమల నుంచి గన్నవరం విమానాశ్రయం వచ్చి నేరుగా దుర్గమ్మ దర్శనానికి రానున్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు.