బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. దాడి ఘటనలో ఇద్దరు నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తాజాగా గుర్తించారు. దాడి జరగడానికి ముందు రోజే మెట్లు ఎక్కి సైఫ్ ఇంటిలోకి దుండగులు ప్రవేశించిన సిసి ఫుటేజ్ తాజాగా లభ్యమయింది. తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. దొంగతనం కోసం ముందుగా సైఫ్ కొడుకు జెహ్ రూమ్ లోకి చొరబడినట్లుగా తెలుస్తోంది. గదిలోకి చొరబడిన దొంగలని చూసి జెహ్ కేర్ టేకర్ గట్టిగా అరవడంతో తన గదిలో నుంచి సైఫ్ అలీ ఖాన్ పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో దుండగులలో ఒకరు సైఫ్ మీద కత్తితో దాడి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
Brahmanandam: బ్రహ్మానందానికి శేఖర్ కమ్ముల ఇంత దగ్గరి చుట్టమా?
ఈ కారణంగా సైఫ్ మెడ సహా వెన్నెముక, చేతుల మీద గాయాలయ్యాయి. వెన్నుముకకు మాత్రం తీవ్ర గాయం అయింది. ఈ నేపథ్యంలోనే లీలావతి వైద్యులు సైఫ్ కి ఆపరేషన్ చేశారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చారు. ఇక సైఫ్ వెన్నుముక నుంచి రెండున్నర అంగుళాల కత్తి మొనను కూడా వైద్యులు తొలగించారు. ప్రస్తుతానికి సైఫ్ ఆరోగ్యం సేఫ్ గా ఉందని లీలావతి వైద్యులు చెబుతున్నారు. మరోపక్క సైఫ్ స్టేట్మెంట్ ను సైతం పోలీసులు రికార్డు చేశారు. ఆయన ఇంట్లో క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ టీమ్స్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న ముగ్గురు పనివాళ్ల నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. దుండగులు ఎవరనేది గుర్తించామని వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.