CM Chandrababu: పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్ చేరుకున్న సీఎం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యూఏఈ పర్యటనను ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు బృందం నేటి (22వ తేదీ) నుంచి యూఏఈలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘భాగస్వామ్య సదస్సు’కు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.
Nara Lokesh: అలాంటి నీచపు ఘటనలకు పాల్పడే వాడెవరైనా.. ఉక్కుపాదంతో అణచివేస్తాం.!
Also Read
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
- Crazy Kalyanam: క్రేజీ కళ్యాణం రివ్యూ..
దుబాయ్ చేరుకున్న వెంటనే సీఎం చంద్రబాబు అబుదాబి ఇండియన్ ఎంబసీ డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్ నాధ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్‌లతో కాసేపట్లో భేటీ కానున్నారు. ఇక తొలిరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఐదు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్, శోభా గ్రూప్, షరాఫ్ డీజీ సంస్థల ప్రతినిధులతో ఆయన ‘వన్ టు వన్’ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే ముఖ్యమంత్రి బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది. మ్యూజియం సందర్శనలో భాగంగా ‘జర్నీ టూ 2071’ థీమ్‌తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పరిశీలిస్తారు.
రాత్రికి, ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన రోడ్ షోకు హాజరుకానున్నారు. ఈ రోడ్ షోలో పాల్గొని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. అలాగే నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు.
తాజావార్తలు
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!