CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ!

  • సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు
  • ఆరుగురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ
  • శుక్రవారం రాత్రి అమరావతికి చంద్రబాబు
Cm Chandrababu

Cm Chandrababu

రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎం అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రేపు వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వరుస భేటీల అనంతరం శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు అమరావతి చేరుకుంటారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, కేంద్ర నౌకాయాన-జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చిస్తారు. తిరిగి రేపు రాత్రి అమరావతి చేరుకుంటారు. ఎల్లుండి అనకాపల్లి జిల్లాలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

×
×
Ad