రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎం అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రేపు వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వరుస భేటీల అనంతరం శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు అమరావతి చేరుకుంటారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా-జాతీయ…