CM Chandrababu: నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
- నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
- రక్షణ, హోం, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహా పలు కేంద్ర మంత్రులతో సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సహాయం కోసం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రక్షణ, హోం, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహా పలు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, జల వనరుల నిర్వహణ లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
Also Read:Weather Report : రుతుపవనాల ఆగమనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన..
Also Read
- 705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- Marco Rubio: భారత్ టూర్‌కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్‌తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
కొత్త క్రిమినల్ చట్టాల అమలు, పాలనాపరమైన సంసిద్ధతపై చర్చ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విధానపరమైన “రోడ్ మ్యాప్” ను సమర్పించడానికి “నీతి ఆయోగ్” పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) సమావేశంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు ఉదయం 10 గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి తో భేటికానున్నారు. “గ్రీన్ ఎనర్జీ” ప్రాజెక్టులలో సహకారం గురించి చర్చించనున్నారు. తర్వాత, ఉదయం 11 గంటలకు సౌత్ బ్లాక్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సమావేశం కానున్నారు.
“బెల్” డిఫెన్స్ కాంప్లెక్స్, “హెచ్.ఏ.ఎల్-ఏ.ఎమ్.సి.ఏ” (HAL-AMCA) కార్యక్రమంతో సహా, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపాదిత వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రమ శక్తి భవన్‌లో జలశక్తి శాఖా మంత్రి సి.ఆర్. పాటిల్ తో సమావేశం కానున్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, పలు ఇతర ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఏపీ సీఎం అధికార నివాసం “జనపథ్-1” లో “శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) జితేంద్ర సింగ్ తో సమావేశం కానున్నారు.
Also Read:Rishabh Pant: నాపై ఫేక్ న్యూస్ రాసేకంటే.. మంచి సమాచారం ఇవ్వండి!
పారిశ్రామిక, విజ్ఞాన సహకారాలపై చర్చించనున్నారు. సాయంత్రం 3 గంటలకు “నార్త్ బ్లాక్”లో ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటి కానున్నారు. రాష్ట్రానికి ఆర్థిక కేటాయింపులు, తోడ్పాటును కోరనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సాయంత్రం 4 గంటలకు “నార్త్ బ్లాక్”లోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన రాష్ట్రాల్లో కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై కీలక సమీక్షా సమావేశం. రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం కానున్నారు.
Also Read:Janhvi Kapoor : కత్తిలాంటి అందాలతో రెచ్చిపోయిన జాన్వీకపూర్..
డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్ సాంకేతిక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రపై చర్చించనున్నారు. రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు న్యూఢిల్లీలోని “భారత్ మండపం”లోని “కన్వెన్షన్ సెంటర్”లో జరగనున్న “నీతి ఆయోగ్” 10వ పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో సంస్కరణలతో కూడిన పాలన నమూనాతో పాటు, చేపట్టిన కీలక అభివృద్ధి కార్యక్రమాలను, సమగ్ర, స్థిరమైన వృద్ధిని సాధించడానికి కేంద్రం నుంచి రాష్ట్రం ఆశిస్తున్న వ్యూహాత్మక సహకారాన్ని చంద్రబాబు వివరించనున్నారు.
తాజావార్తలు
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్‌కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్‌తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!