CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో విధ్వంసం ప్రజావేదిక నుంచే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. తనకు నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని, ప్రాథమిక హక్కులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ పరిణామాల నుంచే కూటమికి బీజం పడిందని చంద్రబాబు తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు.
‘టీడీపీ ఎన్నో విజయాలు సాధించినప్పటికీ 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితం ప్రత్యేకమైనది. ఆ ఎన్నికల్లో కూటమికి 56.5 శాతం ఓట్లను ప్రజలు అందించారు. గతంలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మద్దతుతో పాటు మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయడం అవసరం. ఒకవైపు ఎల్‌నినో కారణంగా సంక్షోభ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండగా.. మరోవైపు అర్నబ్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాన్ నిమిషానికోసారి దిశ మార్చుకునే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. తుఫాన్ పరిస్థితులపై నేను, పవన్ కల్యాణ్, మూడు పార్టీల నాయకులు సమీక్షలు నిర్వహిస్తున్నాము. ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తున్నాము. ప్రతి గంటకూ తుఫాన్‌కు సంబంధించిన బులెటిన్ విడుదల చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తాము’ అని సీఎం పేర్కొన్నారు.
Also Read
- Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
- Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
- Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
- IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతో పాటు వాటికి సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని సూచించారు. ఈసారి పట్టణ ప్రాంతాల్లో ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయని, విద్యావంతులు అభ్యర్థులుగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా పాలనలో స్థిరత్వం ఏర్పడి, ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘సూపర్ సిక్స్’ పథకాలకే పరిమితం కాకుండా, ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. చెప్పిన పనులను చేసి చూపించాలన్న విధానంతోనే ముందుకు సాగుతున్నామని సీఎం తెలిపారు.
మూడు పార్టీల మధ్య ఉన్న సమైక్యత, పరస్పర సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో తీవ్ర ఆర్థిక, పరిపాలనా ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రానికి తిరిగి ఊపిరి పోసి, అభివృద్ధి దిశగా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచలేదని, పైగా ట్రూఆప్ ఛార్జీలు తగ్గించామన్నారు. రాయలసీమ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తయారవుతోందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు వెళ్లామన్నారు. పెట్టుబడిదారులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
ట్రెండింగ్
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!