CM Chandrababu Naidu: ఏపీ సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు

  • ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయానికి చేరుకున్నారు
  • తన భార్య నారా భువనేశ్వరితో కలిసి సచివాలయంలో అడుగుపెట్టారు
  • ఐదేళ్ల తర్వాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబు
  • దారిపొడవునా చంద్రబాబుకు ఘన స్వాగతం
Babu

Babu

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సచివాలయానికి చేరుకున్నారు.. తన భార్య నారా భువనేశ్వరితో కలిసి సచివాలయంలో అడుగుపెట్టారు.. అయితే, చంద్రబాబు ఐదేళ్ల తర్వాత సచివాలయానికి వచ్చారు.. మరోవైపు తన నివాసం నుంచి సచివాలయం వరకు దారిపొడవునా చంద్రబాబుకు స్వాగతం లభించింది.. రోడ్డు వెంట, కూడళ్లలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆయనక స్వాగతం పలికారు.. ఇక, అమరావతి ప్రాంతంలో రైతులు.. ధర్నా శిబిరాలను తొలగించి.. చంద్రబాబుకు స్వాగతం పలికారు.. వెంకటాపాలెం వద్ద భారీ సంఖ్యలో చంద్రబాబు వద్దకు వచ్చారు అమరావతి రైతులు, మహిళలు.. కాన్వాయ్ లో డోర్ తీసుకుని బయటకు వచ్చారు చంద్రబాబు.. ఆయనపై పూలవర్షం కురిపించారు అమరావతి రైతులు, మహిళలు.. మరోవైపు.. ఆయన సచివాలయానికి చేరుకోగా.. ఘనంగా స్వాగతం పలికారు మంత్రులు, ఉద్యోగులు..

Read Also: Modi tadasana: తడసానా వీడియో విడుదల చేసిన ప్రధాని.. ఉపయోగాలివే!

ఇక, ఇప్పటికే తన ఛాంబర్‌కు చేరుకున్నారు సీఎం చంద్రబాబు.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. సాయంత్రం 4:41 గంటలకు సీఎంగా తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు.. తొలి రోజు ఐదు సంతకాలు చేస్తారని తెలుస్తోంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై చేయనున్నారు.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై రెండో సంతకం.. ఫించన్లు రూ. 4 వేలు చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం.. స్కిల్ సెన్సస్, అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభంపై సంతకాలు చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.