CM Chandrababu: అమరావతిలో భారత్ తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీకి శ్రీకారం చుట్టిన సీఎం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ప్రపంచ క్వాంటం దినోత్సవం (World Quantum Day)ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి (Amaravati)లో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ (Quantum Reference Facility)ని ప్రారంభించారు. దీంతో అమరావతి క్వాంటం టెక్నాలజీ (Quantum Technology) అభివృద్ధిలో కీలక కేంద్రంగా మారనుంది.
Nitish Kumar: ముగిసిన నితీష్ కుమార్ శకం.. సీఎం పదవికి రాజీనామా..
Also Read
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ఈ సందర్భంగా SRM యూనివర్సిటీలోని 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ (Open Access Quantum Facility)తో పాటు, మేధా టవర్స్ (Medha Towers)లోని 1Q క్వాంటం ఫెసిలిటీ (1Q Quantum Facility)ని సీఎం ఆవిష్కరించారు. ఈ రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్ బెడ్స్ (Quantum Test Beds) ద్వారా క్వాంటం కంప్యూటింగ్ (Quantum Computing) ఉపకరణాలను పరీక్షించే (Testing), ధృవీకరించే (Certification) సామర్థ్యం రాష్ట్రానికి లభించింది.
ఈ ఫెసిలిటీల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి -273 డిగ్రీల సెల్సియస్ వద్ద పనిచేసే విధంగా రూపొందించబడ్డాయి. ఈ స్థాయి సాంకేతికతతో క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్ (Quantum Computer Hardware) పనితీరును పరీక్షించడం, విశ్లేషించడం సాధ్యమవుతుంది. దీంతో అమరావతి “క్వాంటం వ్యాలీ” (Quantum Valley)గా ఎదగడానికి బలమైన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం ఉపకరణాల తయారీ కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు పెద్ద ఎత్తున ఉపయోగం కలగనుంది. ఇది పరిశోధన, ఇన్నోవేషన్లకు కీలక వేదికగా మారనుంది.
ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్, డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధులు, వివిధ క్వాంటం టెక్నాలజీ సంస్థల నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు (Scientists) హాజరయ్యారు. దేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!