CM Chandrababu: ఎంపీలతో సీఎం సమావేశం.. విభజన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై సూచనలు!
- రెండు గంటల పాటు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం
- పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎంపీలు పార్లమెంట్‌లో తమ స్వరం వినిపించాలని చంద్రబాబు అన్నారు. కేంద్రం నుంచి అదనపు నిధులు తేవడంపై దృష్టి పెట్టాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల రాష్ట్రానికి అదనపు ప్రయోజనాలు రావాలన్నారు సీఎం.
పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ఆర్ధిక పరిస్థితిపై అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి మాట్లాడాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులతో రాష్ట్ర సమస్యలను, ఇతర అంశాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. విభజన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీలకు సీఎం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు ఢిల్లీ వెళ్లినట్టు ఎంపీలతో సీఎం చెప్పారు. వెళ్లిన ప్రతిసారి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించానని, ఇదే వైఖరి ఎంపీలు కూడా కొనసాగించాలని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు.
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
- Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
‘రెండు గంటల పాటు ఎంపీలతో సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిగింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చ జరిగింది. ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రితో ఇప్పటికే సీఎం చంద్రబాబు సమావేశాలు జరిగాయి. ఈ కేంద్ర బడ్జెట్లో అధిక నిధులు కావాలని కోరుతున్నాం’ అని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
- Tags
- ap
- cm chandrababu
- tdp
- tdp mp
తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?